చంద్రబాబుని రిమాండ్ లో పెడతారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయం మొత్తం అవినీతి ఆరోపణల చుట్టూనే తిరుగుతుంది. ప్రధానంగా ప్రతిపక్షం తెలుగుదేశ౦ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తుంది ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో భారీగా అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని భూముల వ్యవహారంలో సిట్ ని ఏర్పాటు చేసింది.

సీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనా సిట్‌ విచారణ చేపట్టనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, జయరామ్‌రాజు, విజయ్‌ భాస్కర్‌, గిరిధర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలను నియమించింది. సిట్‌కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వ౦. అంత వరకు బాగానే ఉంది గాని… సాధారణంగా సిట్ ఏర్పాటు చేస్తే, విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాని ఇక్కడ జగన్ సర్కార్ అనూహ్యంగా సంచలన నిర్ణయం తీసుకుంది.

సిట్ కి ఒక పోలీస్ స్టేషన్ ని కేటాయించింది. అంటే దాని వెనుక ఏదైనా జరగబోతుందా…? ఎవరిని అయినా విచారణకు పిలిచే అధికారం సిట్ కి ఉందని పేర్కొన్నారు. అంటే చంద్రబాబుని కూడా విచారణకు పిలిచి, ఆయన్ను స్టేషన్ లో విచారించి, రిమాండ్ కి పంపే అవకాశం ఉందా…? ఇప్పుడు దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు. మరి చంద్రబాబు అంత ధీమాగా ఉన్నప్పుడు ఆయన్ను రిమాండ్ కి పంపడం సాధ్యమా…?

Read more RELATED
Recommended to you

Latest news