ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన మరో నిర్ణయం కూడా ఒకటి ఉంది. ఈ విషయంలో జగన్ పట్టుదలగా ఉన్నారా లేదా అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి అంటే మండలిలో సభ్యులుగా ఉన్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణతో ఆయన తక్షణమే రాజీనామా చేయించాలి.
మంత్రులతో రాజీనామా చేయించి ఖచ్చితంగా చేస్తాను అని స్పష్టంగా చెప్పగలిగితే, ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మండలి అనేది అనవసరం అని భావించినప్పుడు వాళ్లతో రాజీనామా చేయిస్తే జగన్ తన విశ్వసనీయతను చాటుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే అది జరిగే పని కాదు కాబట్టే జగన్ రాజీనామా చేయడం లేదు అనే అభిప్రాయం వైసిపి కార్యకర్తల్లో కూడా కలిగే అవకాశం ఉంది.
ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం విమర్శనాస్త్రంగా మార్చుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మండలి అనవసరం అంటూ ఆ ఇద్దరు మంత్రులు అసెంబ్లీలో కూడా మాట్లాడారు కాబట్టి, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా క్యాబినెట్ నుంచి వైదొలిగితే అర్థం ఉంటుందని, అప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయానికి సార్థకత ఉంటుందనేది వైసీపీ కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు…? మంత్రులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఎదురు చూడాల్సిందే.