ఫలించని సీనియర్ల ప్రయత్నాలు…. రేవంత్ కు సహకరిస్తారా?

-

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం పూర్తయింది. ఎంతమంది రాష్ర్ట నాయకులు వ్యతిరేఖించినా… ఢిల్లీలో ఉన్న అధిష్టానానికి ఎన్ని లేఖలు రాసినా కూడా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర చర్చలు, సమావేశాల తర్వాత అధిష్టానం మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఇన్నాళ్లుగా ఊరిస్తూ… వస్తున్న పీసీసీ పీఠంపై అందరికీ స్పష్టత వచ్చింది.

పీసీసీ పీఠం కోసం తీవ్రంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో అధిష్టానం కొంత మంది పేర్లను విడుదల చేసింది. అందులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి నేతలు ఉన్నారు. కానీ ఫైనల్ గా అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపడం గమనార్హం. రేవంత్ నాయకత్వాన్ని బయటి వారు కాకుండా కాంగ్రెస్ నేతలే బాహాటంగా వ్యతిరేఖించారు. అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా.. కూడా రేవంత్ నాయకత్వం వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అతనికే పీసీసీ పగ్గాలు కట్టబెట్టింది.

కాంగ్రెస్ కురు వృద్ధుడు, మాజీ ఎంపీ హనుమంత రావయితే ఏకంగా మీడియా ఎదుటే రేవంత్ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలు ఫిరాయించిన వారికి ఎలా పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేఖిస్తూ.. వస్తున్నారు.

మొత్తానికి పీసీసీ కొత్త ఛీఫ్ ప్రకటనతో కాంగ్రెస్ వర్గాల్లో అధిష్టానం నూతనోత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించింది. హుజురాబాద్ ఉప ఎన్నికల ముందు కొత్త పీసీసీ అధ్యక్షుడి ప్రకటన బాగానే ఉన్నా… అతడితో ఎంత మంది కలిసి వస్తారనే అనుమానం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కలగకమానదు.

Read more RELATED
Recommended to you

Latest news