అసలు అయిదేళ్ళు ప్రభుత్వం ఉంటుందా…?

-

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం అయిదేళ్ళు ఉంటుందా…? ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి 116 మెజారిటి ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి 121 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ మనుగడ పై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి.

అంత మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం అనేది ప్రభుత్వానికి కష్టమే. అయితే కమల్ నాథ్ మాత్రం సీనియర్ నేత కావడంతో కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించడం తో ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకి నడిపిస్తారు అనే దానిపై కాంగ్రెస్ భయపడటం లేదు. కొంత మంది మంత్రులు కాస్త హడావుడి ఎక్కువ చేస్తున్నారు. ఇదే కమల్ నాథ్ కి చికాకుగా మారింది.

దాదాపు పార్టీ లో ఉన్న కీలక నేతలు అందరూ ఆయన మాటే వింటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలను కాపాడుకోవడ౦లో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతానికి సంక్షోభం నుంచి ప్రభుత్వం బయటపడింది. కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి కీలకమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అయిదేళ్ళు ప్రభుత్వం నిలబడటం కష్టమే అంటున్నారు.

జ్యోతిరాదిత్య సింధియా లాంటి సమర్ధ నేతలు ఉన్నారు. వీరికి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం కాదు. దిగ్విజయ్ సింగ్ లాంటి దిగ్గజం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ధీమాగా ఉంది అంటున్నారు. అయితే బిజెపిని బద్నాం చెయ్యడానికే కాంగ్రెస్ పార్టీ ఈ డ్రామా ఆడుతుంది అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని అంటున్నారు. ప్రతీ రోజు తుమ్మితే ఊడిపోయే విధంగా ఉంటే మాత్రం ప్రభుత్వం నిలబడటం అనేది కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news