ష‌ర్మిల పార్టీకి ప్ర‌తినిధులు వీళ్లే.. ప‌క్కా స్కెచ్ ప్ర‌కార‌మే ఎంపిక‌

-

తెలంగాణ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌పై స‌మ‌యానికి త‌గ్గ‌ట్టు విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో నిలిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు వైఎస్ ష‌ర్మిల‌(sharmila). అయితే ఈమె రాజ‌కీయ పార్టీపై ఇప్ప‌టికే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆమె పార్టీ పేరుపై ఎన్నో పుకార్లు షికారు చేస్తాన్నాయి. ఇలాంటి టైమ్‌లో రీసెంట్‌గా ఆమె పార్టీపేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ద‌గ్గ‌ర ఆమె పార్టీని రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలుస్తోంది.

sharmila/

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ఇప్ప‌టికే తెలిసింది. అయితే ఆమె పార్టీకి ఎవ‌రు ప్ర‌తినిధులుగా ఉంటారనేదానిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇందుకోసం ఆమె ప‌లువురిని ప్ర‌తినిధులుగా నియ‌మించారు. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి కీల‌కంగా పార్టీ ప‌నుల్లో వీరు ఉండ‌నున్నారు.

వీరికే పార్టీ ప‌గ్గాల‌ను అప్ప‌జెప్పాల‌ని ష‌ర్మిల భావిస్తున్నారు. జిల్లాల వారీగా బేరీజు వేసుకుని మ‌రీ వీరిని సెల‌క్ట్ చేశారు ష‌ర్మిల‌. ఇందుకోసం ఇప్ప‌టికే షర్మిల కార్యాలయం ఓ ప్రకటన కూడా మీడియాకు విడుదల చేసింది. ఇక ఆమె త‌న పార్టీ పేరును త‌న తండ్రి వైఎస్ వైఎస్ఆర్ జయంతి రోజున జులై 8న ప్రకటించబోతోన్న సంగతి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ష‌ర్మిల‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు అయిన వాడుక రాజగోపాల్ పార్టీ బాధ్య‌త‌ల‌ను ప్ర‌ధానంగా చూసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news