గతంలో ఎన్నికల్లో గెలవాలంటే పలుకుబడి, మాటతీరు అభ్యర్థి ప్రవర్తన వీటిని పరిగణలోకి తీసుకొని గెలిపించేవారు. కొంత మంది చేసే అభివృద్ధిని చూసి వంశపారంపర్యంగా అభ్యర్థులు గెలిపించేవారు. ప్రస్తుత కాలంలో మాటకు, పనులతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. డబ్బు పంచితేనే గెలుపులు దగ్గుతున్నాయి. కేవలం డబ్బు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ వ్యాఖ్యనించారు. ఆంధ్రలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డబ్బే కీలకపాత్ర వహించిందరి.. ఓటుకు రూ. 5 వేలు సైతం పంచారని జేసీ దివాకర్ ఆరోపించారు. ఏ ఎన్నికల్లోనైనా డబ్బు పంచకుండా ప్రధాని కూడా గెలువలేరని అలా గెలిస్తే తన ఆస్తి మొత్తం వదిలేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులకు భయం..
నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసు సైతం భయభ్రాంతులకు గురి చేస్తారని ఆరోపించారు. గతేడాది మున్సిపల్ ఎన్నికల్లో ఓ నాయకుడు నామినేషన్ వేస్తే వైఎస్సార్ సీపీ నాయకులు చింపివేశారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారన్నారు. వారు చెప్పిన మాట వినకుంటే ఇష్టానుసారంగా బదిలీలు చేస్తారని అధికారులు భయపడుతున్నారన్నారు. కొన్నిసార్లు అవి తప్పని తెలిసినా ఐఏఎస్, ఐసీఎస్ ఉన్నతాధికారులు తన మనసును చంపుకొని విధులు నిర్వర్తిస్తున్నారని జేపీ ఆరోపించారు.