ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి అధిక సంఖ్యలో కేసులో నమోదు అవుతుండటంతో ప్రజల్లో ఆందోళ మొదలైంది. అయితే ఇప్పటివరకు ప్రజలనే వణికించిన ఈ మహమ్మారి ఇపుడు ప్రజా ప్రతినిధులను వణికించడం మొదలుపెట్టింది. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శ్రీనివాసరావు ఇటీవలే అమెరికా వెళ్లివచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి వచ్చి హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు ఉండటంతో విజయనగరం జిల్లా వైద్యాధికారులు పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఐసోలేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాసరావు ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు, ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఏపీలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలడం ఇదే మొదటి కేసు కావడం గమనార్హం.