ఉత్తరాంధ్ర వైసీపీలో ఇప్పుడు కొన్ని కొన్ని శక్తులు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనే వార్తలు మనం కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. ప్రధానంగా విజయసాయి రెడ్డి వైఖరి నచ్చక చాలా మంది నేతలు పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ల మధ్య సమన్వయం కోసం మంత్రి కురసాల కన్నబాబు ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కావడం లేదు.
అయితే ఇప్పుడు పార్టీకి కొంత మంది ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడం లేదు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్న సరే విశాఖ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు తమ వర్గాల ద్వారా ప్రచారం చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. విజయసాయిరెడ్డి లేకపోతే ముగ్గురు నలుగురు మంత్రులు కష్టపడటం మినహా ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి ప్రజల్లో ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండటంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల మధ్య కూడా సమన్వయం లేదు అని ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసం ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డి కూడా వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు అని కొంత మంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను మార్చకపోతే పార్టీ క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతుందని కొంతమంది అధిష్టానానికి నివేదికలు కూడా పంపిస్తున్నారు.