అల్లూరి జిల్లాలో వైసీపీ స్వీప్..టీడీపీకి మళ్ళీ జీరో.!

-

రానున్న ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటి అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా భారీ విజయం అందుకోవాలని అనుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్వీప్ చేసింది..ఇప్పుడు కొత్త జిల్లాల్లో కనీసం 7-8 స్వీప్ చేయాలని చూస్తుంది. అయితే వైసీపీకి స్వీప్ అవకాశం ఉన్న జిల్లాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఆ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి పూర్తి బలం ఉంది. రాష్ట్రంలో ఉండే గాలితో సంబంధం లేకుండా ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. గత రెండు ఎన్నికల్లో అదే జరుగుతుంది. ఈ జిల్లాలో మొత్తం 3 సీట్లు ఉన్నాయి. అరకు, పాడేరు, రంపచోడవరం..మూడు ఎస్టీ స్థానాలు…గిరిజన ప్రాంతాలు. ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్ పై అభిమానం ఎక్కువ. అదే అభిమానం జగన్ పై కంటిన్యూ అవుతుంది. గత రెండు ఎన్నికల్లో ఈ మూడు సీట్లని వైసీపీనే గెలుచుకుంటుంది.

ఈ సారి కూడా గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏమి పెద్దగా బాగోలేదు. కానీ జగన్ పై అభిమానమే వైసీపీకి బలం…ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు  భారీ ప్లస్. అందుకే ఇప్పటికీ అక్కడ వైసీపీదే హవా.,

ఈ మూడు చోట్ల టి‌డి‌పి వీక్ గా ఉంది. నాయకులు ఉన్నారు గాని..పార్టీ బలపడటం లేదు. దీంతో మళ్ళీ ఇక్కడ ఒక్క సీటు కూడా టి‌డి‌పి గెలవదు. మొత్తం మూడు సీట్లు వైసీపీ గెలుచుకుని అల్లూరి జిల్లాలో స్వీప్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news