ఇంతకు ముందు ఎప్పుడూ జగన్ ని ఇంత హ్యాపీగా చూడలేదు .. కారణం పెద్దదే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అన్యాయమైన విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల ముఖ్యంగా ఆర్థికంగా చాలా నష్టపోయిందని మనకందరికీ తెలిసినదే. అయితే విభజన చట్టంలో ఇచ్చిన హామీల ప్రకారం కేంద్రం నుండి కూడా సరైన నిధులు కూడా రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. పైగా చంద్రబాబు హయాంలో రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ముందు నుండి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. Image may contain: 2 people, people sitting, people eating, table and indoor

ఇటువంటి సమయంలో సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు గురించి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కాంట్రాక్టులను రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ రద్దు చేయడం జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలవరం ప్రాజెక్టుకి ‘పునరావాసం’ అనే విషయం గురించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొదటి నుండి భిన్నాభిప్రాయాలున్నాయి. Image may contain: 2 people, people sitting and indoor

కాగా ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన వైయస్ జగన్ ప్రధాని మోడీ తో గంటకు పైగా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ విషయం గురించి కూడా చర్చకు రావడం మనకందరికీ తెలిసినదే. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు తీసుకొస్తున్న ‘పునరావాసం’ అంశం కి సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రితో జగన్ పూర్తి లైన్ క్లియర్ చేసుకున్నారట.

 

దీంతో ఇంతకు ముందెప్పుడూ లేని హ్యాపీనెస్ పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ కి తాజాగా కలిగినట్లు వైసీపీ పార్టీలో టాక్. ఈ కారణంతోనే తాజాగా జగన్ పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేస్తున్నట్లు అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు సీఎం వైఎస్ జగన్ పోలవరం పనులను పరిశీలించడం జరిగింది. 

Read more RELATED
Recommended to you

Latest news