వివేకా హత్య వెనక ఉన్న ఆ ఐదుగురు ప్రముఖుల పేర్లు లీక్ అయ్యాయి ?

-

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకా హత్య 2019 సార్వత్రిక ఎన్నికల ముందు సంచలనం సృష్టించింది. సరిగ్గా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తర్వాత రోజు జగన్ కి అతిపెద్ద మానసిక దెబ్బ ఏంటి అంటే వైయస్ వివేకానంద హత్య చేయబడటం అని అంటారు చాలామంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి ప్రచార సభ ని జగన్ కాకినాడ లో పెట్టడం జరిగింది. ఆ సభ జరిగిన తర్వాత రోజే వైయస్ వివేకా హత్య చేయబడటం ఆంధ్ర రాష్ట్రంలోనే కలకలం సృష్టించింది. Image result for ys vivekananda reddy jagan

దీంతో ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి నేతలు ఇది టీడీపీ కుట్ర అని ఆరోపించారు. మరోపక్క టీడీపీ నేతలు కావాలని జగన్ తన బాబాయి ని చంపడం జరిగిందని ఆరోపించడం జరిగింది. ఆ సమయంలో జగన్ వైయస్ వివేకా హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.

 

అయితే ఆ తర్వాత ఎన్నికల రావటం జగన్ ముఖ్యమంత్రి అవడం అంతా బాగానే ఉన్నా గానీ వైఎస్ వివేకానంద హత్య విషయంలో బాబుని సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్..తన అధికారం లో మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సమయంలో వైఎస్ వివేకా కూతురు ఇటీవల తన తండ్రి హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలని హైకోర్టును ఆశ్రయించడం ఏపీ రాజకీయాల్లోనే పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ హత్య విషయంలో కడప జిల్లాకు చెందిన ఐదుగురు తెలుగుదేశం పార్టీ సభ్యుల హస్తం ఉన్నట్లు…వారి పేర్లతో కొన్ని వార్తలు లీక్ అవుతున్నాయి. వారిలో ఒకరు మాజీమంత్రి కాగా మరొకరు ఎమ్మెల్సీ అన్నట్టు టాక్ వినపడుతోంది. మరియు వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో పోలీసులే నిగ్గు తేల్చాలి.  

Read more RELATED
Recommended to you

Latest news