బాల‌య్య స్టైల్లో అసెంబ్లీలో ఇర‌గ‌దీసిన రోజా… గ‌న్ వ‌చ్చేలోపు జ‌గ‌న్ వ‌చ్చేస్తాడు..

వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో సోమ‌వారం ర‌చ్చ లేపారు. అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల ప్రారంభం రోజునే ఆమె టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును తీవ్రంగా ఏకి ప‌డేశారు. అసెంబ్లీలో మ‌హిళ భ‌ద్ర‌త అంశంపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా టీడీపీ వాళ్లు నానా రాద్దాంతం చేశారు. ఈ క్ర‌మంలోనే రోజా టీడీపీ హ‌యాంలో జ‌రిగిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌తో పాటు బాల‌య్య అమ్మాయిల‌కు క‌డుపు చేయాల‌న్న వ్యాఖ్య‌లు, అమ్మాయిల‌తో లోకేష్ దిగిన ఫొటోల అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు.

చంద్ర‌బాబుకు ఆడవారి ప్రాణాల కంటే ఉల్లిపాయ‌లే మ‌క్కువ అయ్యాయ‌ని.. త‌న కొడుకు లోకేష్ తినే పప్పులోకి వేసే ఉల్లిపాయ ధర పెరిగిందని చంద్రబాబు బాధపడుతున్నారే గానీ… ఆడపిల్లల భద్రత గురించి ప‌ట్టించుకోవం లేద‌ని అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చారు. గ‌తంలో చంద్ర‌బాబు మ‌గ బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటుందా ? అంటూ ఆడ పిల్ల పుట్టుక గురించే ప్ర‌శ్నించార‌ని… అలా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచి నందుకే ఆయ‌న్ను అలా మూల కోర్చోపెట్టార‌ని ఫైర్ అయ్యారు.

 

ఇక దిశ గురించి రోజా మాట్లాడుతూ ఆమెను చంపిన‌ప్పుడు స్పందించ‌ని మావ‌న హ‌క్కుల క‌మిష‌న్ ఆమెను చంపిన నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసిన‌ప్పుడు నిరసన తెలపడం సరికాదన్నారు. ఇక గ‌తంలో త‌న అక్క‌ను వేధించిన వారిని చంపేయాల‌ని ఉంద‌ని చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు మాత్రం ఆడ‌పిల్ల‌ల‌ను రేప్ చేసిన వారికి రెండు బెత్తం దెబ్బ‌లు వేయాల‌న‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ఫైర్ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య సినిమాల్లో ఎలా డైలాగ్ చెపుతారో ? అదే స్టైల్లో రోజా ఓ డైలాగ్ చెప్పి స‌భ్యుల చేత చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్నారు. ఎవ‌రైనా ఆడ‌పిల్ల‌ల జోలికి రావాలంటేనే వెన్నులో వ‌ణుకు పుట్టించే చ‌ట్టాలు తీసుకు రావాల‌ని ముఖ్యమంత్రిని కోరుతున్నానని రోజా చెప్పారు. గన్‌ వచ్చేలోగా జగన్ వస్తారు… రక్షిస్తారన్న ధైర్యం ఆడపిల్లల్లో కనిపిస్తోంద‌ని కూడా జ‌గ‌న్‌ను ప్ర‌శంసించారు.