వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఒక ఛానల్ చర్చా వేదికలో పాల్గొన్న ఆయన, ఒక ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో చంద్రబాబును ఇరికించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న చట్టాల వల్ల అందుకు సాధ్యం కాదని.. చట్టాలు మార్చడాన్ని పరిశీలించాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబును ఫిక్స్ చేయలేమని ఆయన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిని మార్చడానికి గానూ ఈ వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తుందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. శుక్రవారం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆరోపణలపై సిబిఐ విచారణ చేసుకోవాలని డిమాండ్ చేసారు.
దిక్కు ఉన్న చోట చెప్పుకోవాలని కూడా ఆయన సవాల్ చేయడం చర్చనీయంశంగా మారింది. తాము తప్పు చేయలేదు చేయమని స్పష్టంగా చెప్పారు. వైసీపీ నేతలు తప్పులు చేసి రాత్రుళ్ళు నిద్ర కూడా పోవడం లేదని ఎక్కడో ఉన్న భూములను చూపించి అవినీతి అంటూ ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు రఘు రామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.