‘ డిఫెన్స్’ చేయడం లో చతికిలపడుతున్న వైకాపా … !!

-

కరోనా వైరస్ విషయంలో సమస్యలను డిఫెండ్ చేయటంలో జగన్ సర్కార్ చతికిల బడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇదే సమస్య అయినా గాని కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వైరస్ యొక్క పరిస్థితి తెలియజేస్తూనే మరోపక్క అమలుచేస్తున్న నిర్ణయాల విషయంలో లౌక్యం ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చాలా డిఫెండింగ్ చేస్తున్నారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడో దశ లాక్ డౌన్ పొడిగించిన తర్వాత మద్యం దుకాణాలకు మినహాయింపు ఇవ్వడం జరిగింది.Difference between Jagan and KCR as discovered by RK అయితే ఈ విషయంలో కేంద్రం ప్రకటించిన తర్వాత వెంటనే జగన్ ఏపీలో మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జగన్ చేసిన పనినే చేశారు. కాకుంటే లౌక్యం ప్రదర్శించారు. తెలంగాణలో గుడుంబా, సారా, అక్రమ మద్యం ఏరులై పారకుండా మద్యం షాపులను తెరుస్తున్నాననని చాలా తెలివిగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేంద్రం ఆదేశాల మేరకు మాత్రమే ఓపెన్ చేస్తున్నట్లు కేసీఆర్ అన్నారు.

 

అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ కి విపక్షాల నుండి భయంకరమైన విమర్శలు వస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా వెళ్ళిపోతున్న గాని కొన్ని విషయాల్లో జగన్ ఫెయిల్ అవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. మీడియా కంట్రోల్ విషయంలో అదే విధంగా ప్రభుత్వం ఏది చేస్తుంది అన్న దాని విషయంలో జగన్ చెప్పలేకపోతున్నారని అంటున్నారు. దీంతో ప్రతిపక్షాల నుండి దాడులు వస్తున్నా గాని డిఫెన్స్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వైసీపీలో చాలామంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కానీ ఇదే విషయంలో కేసీఆర్ విపక్షాలకు సరైన అవకాశం ఇవ్వకుండా చాలా డిఫెండింగ్ చేస్తే లౌక్యం ప్రదర్శిస్తూ జగన్ చేసిన పని చేస్తున్నా గాని తనపై విమర్శలు పడనవసరం లేదు. దీంతో డిఫెన్స్ చేయటం విషయంలో వైకాపా ప్రభుత్వం చాలావరకు వెనకబడి పోయిందని అంటున్నారు విశ్లేషకులు. చేస్తున్న పనిని సక్రమంగా ఎందుకు చేస్తున్నారో అన్న దాని గురించి చెప్పలేక జగన్ విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news