సమయం సందర్భం ఉండాలి బాబుగారూ .. ముందు అది తెలుసుకోండి .. తరవాత 40 ఇయర్ ఇండస్ట్రీ !

-

ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ దెబ్బతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా దేశాలలో ప్రధానులు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. భారతదేశంలో కూడా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించారు. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు ప్రజలను చైతన్య పరుస్తూ అవసరాలను తీరుస్తూ లాక్ డౌన్ పక్కాగా అమలు అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు.Vijay Sai Reddy Refuse to Apolozy to Chandrababu Naiduముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా కంట్రోల్ లో ఉంది అని జాతీయ స్థాయిలో వార్తలు ప్రభుత్వ పని తీరుపై పొగిడే విధంగా వస్తున్నాయి. ఇటువంటి టైం లో వైరస్ కంట్రోల్ లో ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నట్లు వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇటీవల విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ పార్టీ, దాని కిరాయి మేధావులకు కంటగింపుగా మారింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం జీర్ణించుకోలేక పోతున్నారు.

 

మరో వైపు హైదరాబాద్ లో ఉంటున్న వారిని ఉసిగొల్పే కుట్రలకు తెరలేపారు”అని అన్నారు . మరొక ట్వీట్ లో “దూరదృష్టి, ప్రజల పట్ల బాధ్యత, ఎటువంటి పరిస్థితులనైనా అదుపు చేయగల నాయకుడే ఇవ్వాల్టి అవసరం. దేశమంతా భీతిల్లుతున్నా సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసి కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించడం అసాధారణం. దేశమంతా ఆయన మార్గాన్ని అనుసరిస్తుంది” అని అన్నారు. ఏదో మామూలు టైములో మీడియా ముందు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని సమయం సందర్భం లేని టైంలో కాదు ఇటువంటి టైం లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నట్టుగా చంద్రబాబుకి ట్విట్టర్ ద్వారా గట్టి స్ట్రోక్ విజయసాయిరెడ్డి ఇచ్చారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news