విజయ్ సాయి రెడ్డి అలా చేయలేదని బలంగా చెబుతున్న వైకాపా సపోర్టర్ లు..!

-

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని జగన్ సర్కార్ పదవి నుంచి తొలగిపోయేలా కొత్త ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి పోవటంతో ప్రతిపక్ష మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిమ్మగడ్డ ని పదవి నుంచి తొలగించడం పై అధికార పార్టీపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం జరిగింది. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగా రిప్లై ఇచ్చారు. కరోనా వైరస్ వల్ల సెల్ఫ్ క్వారెంటైన్ చేస్తూ రాజకీయాలకు ప్లాట్ ఫాం లేక ఎక్కడ హైదరాబాదులో కూర్చుని హడావిడి చేస్తున్నావు అన్నట్టుగా విమర్శలు చేశారు.సాయిరెడ్డి - నాగబాబు భేటీ, వేడెక్కిన ...విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల టైంలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి విజయసాయిరెడ్డి కామన్ ఫ్రెండ్ ద్వారా నా ఇంటికి వచ్చారని ఆరోపిస్తూ విజయసాయిరెడ్డిని గుంటనక్క తో పోల్చారు. దీంతో ఈ వార్త ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కాగా జనసేన తో పొత్తు కోసం విజయసాయిరెడ్డి నాగబాబు ఇంటికి వెళ్లారు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని వైకాపా సపోర్టర్ లు అంటున్నారు. అదంతా నాగబాబు కల్పించిన స్టోరీ అని అంటున్నారు.

 

ఎందుకంటే అప్పటికే పాదయాత్రలో మరియు ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ …చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పార్ట్నర్స్ అంటూ ప్రచారం చేసి బలంగా ఆ వాదన ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేవలం చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కోసమే పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని ప్రతి చోట జగన్ చెప్పుకు రావడం జరిగింది. అటువంటి జనసేన పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించింది అని నాగబాబు చెప్పడంలో…వాస్తవం లేదని అందరికీ తెలుస్తుందని వైకాపా సపోర్టర్ లు అంటున్నారు. అంతేకాకుండా అప్పటికె పలు మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్…కుదిరితే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఇద్దరు పోటీ చేసిన వైకాపా అధికారంలోకి రాకుండా ఆపటం కష్టమని కూడా వ్యాఖ్యలు చేశారు. మరి అలంటి జనసేన పార్టీతో విజయసాయి రెడ్డి పొత్తు కోసం ప్రయత్నించారు అంటూ నాగబాబు చెప్పడం చాలా వెటకారంగా ఉందని అంటున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news