వచ్చే ఎన్నికల్లో అనుకున్నదే జరగబోతోందా? వైసీపీ ప్రభంజనాన్ని సృష్టించబోతుందా? అధికార టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగలబోతోందా? వీటన్నింటికీ అవుననే సమాధానం చెబుతోంది సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ…
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించనుందట. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అనే సర్వే తేల్చి చెప్పింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసిన ఈ సంస్థ… వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించనుందట.
గత నెల ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు చేసిన అధ్యయనం ద్వారా ఏపీ ప్రజలు ఎవరివైపు ఉన్నారో చెప్పుకొచ్చింది. వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని సర్వే వెల్లడించింది.
సర్వే ప్రకారం… వైఎస్సార్సీపీ పార్టీ 122 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుందట. మరోవైపు అధికార టీడీపీ 53 సీట్లను గెలుచుకుంటుందట. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటను కూడా గెలుచుకోదట. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒక్క సీటును గెలుచుకోలేవట.
సర్వే ఎలా చేశారంటే…?
వీళ్లు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు.. ఇలా రకరకాల వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది.
ఓట్ల శాతం తీసుకుంటే… వైఎస్సార్సీపీకి 47.8 ఓట్ల శాతం వస్తుందని అంచనా వేయగా… టీడీపీకి 43.3 శాతం ఓట్ల వస్తాయట. జనసేన కు 4.6, బీజేపీకి 1.9, కాంగ్రెస్ కు 1.7, సీపీఐ 0.3, సీపీఎం 0.2, ఇతరులకు 0.2 శాతం ఓట్ల నమోదవుతాయని సర్వే అంచనా వేసింది.