కేసీఆర్ ఉద్యోగ ప్రకటన… వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయం: వైఎస్ షర్మిళ

-

పోరాటాలలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందే అని అన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. ఈరోజు కేసీఆర్ గారి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయంగా అభివర్ణిస్తూ ట్విట్ చేశారు. ఇది తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తల విజయం అని అన్నారు. మేము పార్టీ పెట్టకుముందే నిరుద్యోగుల పక్షాన 3 రోజుల పాటు నిరాహారదీక్షలు చేశామని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 17 వారాల పాటు నిరాహార దీక్షలు చేశామని అన్నారు. మేము పోరాటం చేస్తేనే ప్రతిపక్షాలకు సోయి వచ్చింనదన్నారు. అధికార పక్షానికి బుద్దివచ్చిందని షర్మిళ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పే అలవాటున్న మీరు,ఈరోజు మళ్లీ అబద్దాలు చెప్పారు. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీలుంటే… కేవలం 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని ఫైర్ అయ్యారు. మీరు ఇవి కూడా నింపుతారనే గ్యారెంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రన మా పోరాటం ఆగిపోదు. ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేసేవరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు నింపేవరకు, నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిళ.

Read more RELATED
Recommended to you

Latest news