ఉద్వేగాల జ‌డిలో ఉద్య‌మోత్సాహం..సెబ్బాస్ రా కేసీఆర్

-

అసెంబ్లీ సాక్షిగా
ఆనంద నీరాజ‌నం
తెలంగాణాలో మొత్తంగా 91,142 ఉద్యోగ ఖాళీలు,వెంటనే నోటిఫికేషన్లు..అంటూ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్.తెలంగాణలో ఉద్యోగ విభజన పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో 91,142 ఖాళీలు ఉన్నాయమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీటిని వెంటనే నోటిఫై చేసి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.కాంట్రాక్ట్ పోస్టులు11,103 మంది ఉద్యోగులు ఉన్నారని.. వారి వయసు అయిపోతుందని.. ఇటీవలే హైకోర్ట్ పర్మిషన్ ఇచ్చిందని.. త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామని అన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల‌కు శుభవార్త.. 11,103 మంది రెగ్యుల‌రైజ్

కాంట్రాక్టు ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామ‌ని ప్రకటించారు సీఎం కేసీఆర్.కాసేప‌టి క్రితమే..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టు దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే వస్తాయని,స్థానిక‌త‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని ప్రకటన చేశారు.తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాల భర్తీకి ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు.

నేను ప‌క్కా లోక‌ల్…
అటెండర్ నుంచి ఆర్డీవో దాకా…..
95 శాతం ఉద్యోగాలు లోకల్ కే
తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టు దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. జోనల్‌ వ్యవస్థ కారణంగా ఇది సాధ్యం కాబోతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టమని కీర్తించారు.

సినిమా మారింది..
బ‌తుకు చిత్రం అదిరింది
తెలంగాణ భాష మాట్లాడితేనే
హీరోలు క్లిక్ అవుతున్నారు
తెలంగాణ భాష అంటే ఒకప్పుడు సినిమాల్లో జోకర్లకు, విలన్లకు వాడే వారని.. ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమాల్లో హీరోలు క్లిక్ అవుతున్నారని అన్నారు సీఎం కేసీఆర్. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ.. ఈ క్రింది వ్యాఖ్యలు చేశారు. మూడు విషయాలు ప్రధానంగా భాష పరిరక్షణ జరిగిందని, తెలంగాణ కల్చర్ ను ప్ర‌మోట్ చేస్తూ, బతుకమ్మ, పోచమ్మ, బోనాలు ఇలా అన్ని ప్ర‌ధాన పండుగ‌ల‌కూ నిధులను కేటాయించాం. తెలంగాణలో నీటి గోస పోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు నీళ్లూ,నిధులూ, నియామకాలు లక్ష్యంగా సాగింది. అది కూడా నెర‌వేరుతోంది. ఎన్నో పండగలను రాష్ట్ర పండగలుగా గుర్తించాం.. మేడారం, బోనాల పండగకు నిధులు కేటాయిస్తున్నాం అని సీఎం వెల్ల‌డించారు.

ఆ రోజు తెలంగాణ సాధ‌న‌కు 
నేనూ లాఠీ దెబ్బలు తిన్నా
తెలంగాణ రాష్ట్రం కోసం నేనూ లాఠీ దెబ్బలు తిన్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాసేటి క్రితమే..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టమని చెప్పారు. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నాను.. వివక్ష,అన్యాయంతో తెలంగాణ నలిగిపోయింది అని ఆవేద‌న చెందారు.

ముందున్న రోజులు
అన్నీ మంచివే! నిరాశ వ‌ద్దు
ప్రతి ఏడాదీ
జాబ్ క్యాలెండర్ విడుదల
వయో పరిమితి పెంపు
ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, అపోహాలు పోవడానికి యువకులకు స్పష్టత ఉండటానికి ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతీ సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి పారదర్శకంగా ఉద్యోగ నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు. ఈ మేరకు అన్ని విభాగాలు ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయని.. నోటిఫికేషన్ల జారీ కోసం నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయని..ఉద్యోగ ఆశావహులు ఆయా పరీక్షలకు పోటీ పడే విధంగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ.. నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ అన్నారు. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీస్ మినహా అన్నింటిలో వయో పరిమితి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని..గరిష్ట వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏళ్లు,ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు,దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని సీఎం అన్నారు.

గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు :

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు
గ్రూప్‌ 2- 1,373 ఉద్యోగాలు
గ్రూప్‌ 4- 9168 పోస్టులు

క్యాడర్ వారీగా ఖాళీలు..

జిల్లాల‌లో- 39,829
జోన్లలో- 18,866
మల్టీజోనల్‌ పోస్టులు- 13,170
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268
నిజామాబాద్ – 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 1,769
రంగారెడ్డి – 1,561
కరీంనగర్ – 1,465
నల్లగొండ – 1,398
కామారెడ్డి – 1,340
ఖమ్మం – 1,340
భద్రాద్రి కొత్తగూడెం – 1,316
నాగర్‌కర్నూల్ – 1,257
సంగారెడ్డి – 1,243
మహబూబ్‌నగర్ – 1,213
ఆదిలాబాద్ – 1,193
సిద్ధిపేట – 1,178
మహబూబాబాద్ – 1,172
హనుమకొండ – 1,157
మెదక్ – 1,149
జగిత్యాల – 1,063
మంచిర్యాల – 1,025
యాదాద్రి భువనగిరి – 1,010
జయశంకర్ భూపాలపల్లి – 918
నిర్మల్ – 876
వరంగల్ – 842
కుమ్రం భీం ఆసీఫాబాద్ – 825
పెద్దపల్లి – 800
జనగాం – 760
నారాయణపేట్ – 741
వికారాబాద్ – 738
సూర్యాపేట – 719
ములుగు – 696
జోగులాంబ గద్వాల – 662
రాజన్న సిరిసిల్ల – 601
వనపర్తి – 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..జోన్‌లలో18,866 ఖాళీలు,మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్ప‌ష్ట‌మ‌యిన గ‌ణాంకాల‌తో స‌హా సీఎం కేసీఆర్ వెల్ల‌డి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news