యువతకు కాంగ్రెస్ అండగా నిలుస్తుంది : పొంగులేటి

-

ఉద్యోగుల నోటిఫికేషన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. డబ్బుల కోసం పరీక్షా పేపర్లను బఠాణీల్లాగా అమ్ముకున్నారని, నిరుద్యోగులకు ద్రోహం చేశారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను దోచుకోని , మభ్య పెట్టి అధికారం లోకి రావాలని బిఆర్ఎస్ అనుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన యువతను బిఆర్ఎస్ గాలికొదిలేసిందని పొంగులేటి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

I Will Contest On This Ground As Per The Wishes Of People: Ponguleti |  INDToday

నీచాతీ నీచంగా, బజారులో బటానిల్లాగా గ్రూప్ 1 పరీక్ష పేపర్లను బిఆర్ఎస్ అమ్ముకున్నదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులకు కోచింగ్ కు అయిన ఖర్చులను బిఆర్ఎస్ ఇవ్వలేదన్నారు. ఐటీలో నిష్ణాతులమని చెప్పుకునే బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అసమర్థత బయట పడిందన్నారు పొంగులేటి.

సాఫ్ట్ వేర్ తప్పిదంతో 25 మంది 10వ తరగతి విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. యువత , విద్యార్ధులు నిరుత్సాహ పడొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడబోతుందని చెప్పారు. బిఆర్ఎస్ చేసిన మోసం నుంచి నిరుద్యోగులను కాంగ్రెస్ కాపాడబోతుందని పొంగులేటి తెలిపారు. .

Read more RELATED
Recommended to you

Latest news