ధరల మంట మామూలుగా లేదు. ఒకటి తగ్గితే.. మరొకటి పెరుగుతుంది. మొన్నటికి మొన్న టమాటా ఠారెత్తించింది. ఇప్పుడు కందిపప్పు వంతు. కిలో కంది పప్పు రిటైల్ మార్కెట్ లో 200 రూపాయలకు చేరింది. కందిపప్పు వల్ల… జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం సమస్య తీరుతుంది. గుండెకు సంబంధించిన సమస్యల్ని కందిపప్పు నివారిస్తుంది… గుండెకు వ్యాధులు రాకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. దీంతో మారే ఏ పప్పుకు లేని డిమాండ్ కందిపప్పును ఏర్పడుతుంది. దీంతో కందిపప్పు ధర రోజు రోజుకు పెరుగుతుంది. అసలు డైలీ కందిపప్పు తినేవారు కూడా ఉన్నారు.
ఇలాంటి ఈ సమయంలో కందిపప్పు ధర పెరుగుతుండడం సామాన్య ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది.పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా, కందిపప్పు ధరలు అమాంతం ఆకాశానికి పెరిగేసాయి. కేజీ కందిపప్పు రూ. 150 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు పెరిగి 200 లకు చేరింది. దీంతో సామాన్య, పేద ప్రజలకు కందిపప్పు అందని ద్రాక్షలా మారిపోయింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కందిపప్పు ధర పెరిగి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.కంది సాగు తగ్గడం, ఉత్పత్తి పడిపోవడంతో పప్పు ధర పెరుగుతుందని చెబుతున్నారు. వచ్చే రోజుల్లో కిలో కంది పప్పు రూ. 200 లకు పైనే ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో పేదలు కంది పప్పు కొనలేరు. గతంలో కందిపప్పు ధర పెరిగినప్పుడు రేషన్ షాపుల ద్వారా కంది పప్పును రాయితీతో అందించారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి కంది పప్పును రేషన్ షాపుల ద్వారా రాయితీపై
అందించాలని ప్రజలు కోరుతున్నారు