ముంబయిలో కోట్లు పోసి ఇల్లు కొన్న బుట్టబొమ్మ..గృహ ప్రవేశం ఫోటోలు వైరల్

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే. వరుస హిట్లతో దూసుకు పోతుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. ముఖ్యంగా టాలీవుడ్‌ టాప్‌ హీరోల సరసన… వరుసగా సినిమాలు చేస్తూ.. తన క్రేజ్‌ ను మరింత పెంచుకుంటుంది. అయితే.. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కొత్త ఇంటిలోకి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా స్పష్టం చేసింది పూజా హెగ్డే.

ముంబయిలో కొత్త ఇంటిలో పూజా చేస్తున్న ఫోటోను పోస్ట్‌ చేసింది ఈ బ్యూటీ. ఎంతో సంప్రాదాయ దుస్తుల్లో పూజా హెగ్డే అందరినీ కనివిందు చేస్తుంది. ఇక ఈ పోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా…. తెలుగులో ప్రస్తుతం స్టార్‌ హీరోలతో నటిస్తూ.. పూజా హెగ్డే ఫుల్‌ ఫామ్‌ లో ఉంది. అల వైకుంఠ పురుములో, లాంటి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన పూజా హెగ్డే… రాధే శ్యామ్‌, ఆచార్య సినిమాలతో రిలీజ్‌ కు సిద్దంగా ఉంది. అలాగే.. తమిళ హీరో విజయ్‌ బీస్ట్‌, హిందీలో రణ్‌ వీర్‌ సింగ్‌ తో సర్కస్‌ సినిమా కూడా చేస్తుంది పూజా హెగ్డే.