ఇక జంతువులకు కరోనా టీకా… కేంద్రం కీలక నిర్ణయం

-

చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతోంది కరోనా వైరస్. ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో రోజూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నెల క్రితం వరకు రోజూ వారీ కేసులు కేవలం 10 వేల లోపే ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షలను దాటింది. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి తీవ్రత అర్థం అవుతోంది.

ఇదిలా ఉంటే జంతువులు కూడా కరోనా బారిన పడుతున్నాయి. ఇప్పటికే పలు జూల్లో జంతువులు కరోనా బారిన పడ్డాయి. ఇటీవల చెన్నై జూలో రెండు సింహాలు కరోనా బారిన పడి మరణించాయి.  ఈ నేపథ్యంలో జంతువులకు కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలోని ఆరు జూల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. కేవలం సింహాలు, చిరుతలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా డోసలు మధ్య వ్యవధి 28 రోజులుగా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news