తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటి రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హోమ్లి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించి మరింత పాపులారిటీని దర్శించుకున్న రాశి.. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ మరింత విజయవంతంగా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇకపోతే తాజాగా ఈమె నటిస్తున్న సీరియల్ భారీ స్థాయిలో రేటింగ్స్ వస్తూ ఉండడంతో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సినిమాల ద్వారా రాశి బాగానే ఆస్తులు కూడబెట్టారని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి మాట్లాడుతూ.. తన ఆస్తులకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకుంది. రాశి మాట్లాడుతూ.. వెనక్కి తిరిగి చూస్తే నా చైల్డ్ హుడ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. నేను ఆ సమయంలో బిజీ బిజీగా షూటింగ్స్ లో పాల్గొన్నాను. నేను డబ్బులు ఏమీ పోగొట్టుకోలేదు అంటూ కూడా తెలిపింది. సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని.. ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగానే కనిపించాలని భావిస్తాను అంటూ కూడా ఆమె తెలిపింది ఇకపోతే ఈమె నిక్ నేమ్ మంత్ర.
42 సంవత్సరాల వయసున్న రాశి ఆస్తి విలువ సుమారుగా రూ.25 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. 5000 రూపాయల పారితోషకంతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. దీని విలువ 2.5 కోట్ల రూపాయలు. ఖరీదైన కార్లు కూడా ఈమె సొంతం.. మొత్తంగా అయితే సినిమాల ద్వారా అటు సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు రాశి.