NBK 108 మూవీపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్..!

-

అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ .. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమాను సంక్రాంతి బరిలో పోటీగా దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ క్రమంలోని జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరొకవైపు బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తీయబోతున్న విషయం తెలిసిందే . అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు.

ముఖ్యంగా డిసెంబర్ 8న బాలకృష్ణ అనిల్ రావిపూడి మూవీ సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. 12 రోజులపాటు జరిగే ఈ తొలి షెడ్యూల్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారట. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొదట్లోనే యాక్షన్స్ సన్నివేశాలు చూపిస్తే ఏ రేంజ్ లో థియేటర్లలో ఈలలు పడతాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అనిల్ రావిపూడి దీనిని దృష్టిలో పెట్టుకొని సినిమాపై బజ్ పెంచడానికి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ అంశాలు ఉన్నా.. సినిమా మాత్రం తన పంతాలో ఎంటర్టైనింగ్ గా సాగుతుందని కూడా చెబుతున్నారు.

బాలయ్య బాబుతో సినిమా నెక్స్ట్ లెవెల్ అంటూ ఊరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ షెడ్యూల్ తోనే యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఇకపోతే ఈ యాక్షన్ సీన్స్ కూడా రెగ్యులర్ బాలయ్య సినిమాల్లో ఉండేలా కాకుండా కొత్తగా డిఫరెంట్ గా ప్లాన్ చేయబోతున్నారట. ఇప్పటికే పక్కా హిట్ అన్న సెంటిమెంటును పొందిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాలయ్య సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news