పృధ్వీ పాపాన్ని పోసాని కడిగారా…?

-

ఇటీవల అమరావతి రైతులను ఉద్దేశించి సిని హాస్యనటుడు, ఎస్వీబీసి చైర్మన్ పృథ్వి రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పెయిడ్ ఆర్టిస్ట్ లు అనడమే కాకుండా ఆడి కార్లు వేసుకొచ్చారు అని, బంగారు గొలుసులు వేసుకుని వచ్చారు తాను ఎక్కడా ఇలాంటి రైతులను చూడలేదు అనడమే కాకుండా మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రైతులు అంటే బురదలో ఉండి, దొరికింది తింటారు అంటూ మాట్లాడారు.

దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. తాజాగా దీనిపై మాట్లాడిన మరో నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని, రాష్ట్రమూ బాగుపడుతుందని ప్రేమతో, అభిమానంతో 33వేల ఎకరాలు ఇచ్చారు. అది త్యాగం కాదా? వారిని పెయిడ్‌ ఆర్టిస్టులంటావా? సిగ్గు పడాలి పృథ్వీ. ఎన్టీఆర్‌, చంద్రబాబు వల్ల కమ్మవాళ్లు బతకడంలేదు. వాళ్లు పొలం పనులు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారు.

వాళ్లను పృథ్వీ రోడ్డుమీదికి ఈడ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై పలువురు రాజకీయ పరిశీలకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పృధ్వీ వ్యాఖ్యలతో నష్టం భారీగా జరిగిందని ఆ నష్టాన్ని పోసాని ద్వారా కవర్ చేసే ప్రయత్నం చేసారని, ఆయన వ్యాఖ్యలతో సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చిందని గమనించిన ప్రభుత్వ పెద్దలు పోసాని ద్వారా నష్టం పూడ్చే ప్రయత్నం చేసారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news