పోస్ట్ ఆఫీస్ స్కీమ్: మీ డబ్బులని ఇలా డబుల్ చేయండి..!

-

చాలా మంది ఈరోజుల్లో డబ్బులని వారికి నచ్చిన పథకాల్లో పెడుతున్నారు. అయితే ఇలా డబ్బులని ఇన్వెస్ట్ చేస్తే చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది. బ్యాంకు, పోస్టాఫీసు లేదా ఎల్ఐసీ పథకాలలో చాలా మంది డబ్బులని పెడుతున్నారు. మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్ల లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో చక్కటి లాభాలని పొందవచ్చు. భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఏకమొత్త డిపాజిట్ పథకం ఇది. ఈ స్కీము తో నిర్ణీత వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు.

ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి 7.2 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. కిసాన్ వికాస్ పత్రలో మీరు కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా ఎంత అయినా పెట్టుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర పథకం కింద డిపాజిట్ల రెట్టింపు కాలపరిమితి కూడా తగ్గించేసింది. గత 120 నెలలతో పోలిస్తే ప్రస్తుతం కేవలం 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాస్ పత్రాన్ని కనీసం 18 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు ఈ స్కీము లో చేరచ్చు. బ్యాంకు ఖాతాలు లేని గ్రామీణ భారతదేశం లోని ప్రజలు ఈ స్కీము లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేవీపీను పెద్దవారితో లేదా మైనర్ కోసం సంయుక్తంగా కూడా కొనుగోలు చేయవచ్చు.

పెద్దవారు పిల్లల తరపున లేదా మానసిక అనారోగ్యంతో ఉన్న వారి తరపున దరఖాస్తు చెయ్యచ్చు. రూ.10 లక్షలకు పది లక్షల రాబడి వస్తుంది. పథకంలో 10 లక్షలు పెట్టుబడి పెడితే మీరు రూ. 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో 20 లక్షలు పొందవచ్చు. చక్ర వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని అందిస్తుంది. ఏజెంట్ సహాయం తో పెట్టుబడి పెడితే ఫారం-ఏ1 తప్పనిసరిగా పూర్తి చేసి సబ్మిట్ చెయ్యాలి. కేవైసీ ప్రక్రియ కోసం, గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒక దాని కాపీని ఇవ్వాల్సి వుంది. కేవీపీ సర్టిఫికేట్‌ను స్వీకరించడానికి నమోదిత ఈమెయిల్ చిరునామాను కూడా అందించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news