పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్.. 2 లక్షలు బెనిఫిట్…!

ఈ మధ్యన ఎక్కువ మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెడితే చాలా చక్కటి లాభాలు పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. రిస్క్ ఏమి ఉండదు. పైగా లాభాలు కూడా. పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అని పిలువబడే పోస్ట్ ఆఫీస్ FD పథకం ఎంతో ఉపయోగపడుతుంది.

1, 2, 3 , 5 సంవత్సరాల వరకు వివిధ కాలవ్యవధి కోసం దీనిలో పెట్టుకోవచ్చు. కనీసం రూ. 1,000 పెట్టుబడితో ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని కాలాల్లో మీకు భిన్నమైన అధిక వడ్డీ రేటు వస్తుంది. దీనిలో డబ్బులు పెట్టాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు. దీనిలో ఎంతైనా పెట్టచ్చు లిమిట్ ఏమి లేదు.

ఆదాయపు పన్ను రాయితీ సెక్షన్ 80C కింద మినహాయింపు వుంది. రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ స్కీమ్ కింద ఖాతాను తెరిచిన తర్వాత కనీసం 6 నెలల వరకు డబ్బును తీసుకోవడానికి అవ్వదు.

ఈ స్కీమ్ లో మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే ఐదు ఏళ్ళు అయ్యాక రూ. 7,07,389 రాబడి లభిస్తుంది. మిగిలిన బ్యాంకుల కంటే కూడా ఎక్కువే వస్తుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు పోస్టాఫీసులో డబ్బులు పెడితే ఇంకాస్త ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ ని ఆన్ లైన్ లో లేదా పోస్టాఫీసులో ఓపెన్ చెయ్యచ్చు.