ఈ పోస్టాఫీసు స్కీమ్స్ తో బ్యాంకుల కంటే ఎక్కువ డబ్బులు పొందొచ్చు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ ద్వారా మనం మంచిగా డబ్బులను పొందొచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన కూడా చక్కటి లాభాలను పొందొచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే బ్యాంకుల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయట. మరి ఆ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌:

ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలొస్తాయి. వృద్ధులకి స్థిరమైన ఆదాయాలను అందించేందుకే ఈ స్కీమ్. ట్యాక్స్ బెనిఫిట్స్ తో పాటుగా ఎన్నో బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది. రూ.15 లక్షల వరకు ఒకేసారి ఇన్వెస్ట్ చెయ్యచ్చు. 7.6 శాతం వరకు వడ్డీని దీని ద్వారా పొందొచ్చు. కానీ చాలా బ్యాంకులలో వడ్డీ రేట్లు 5.5 శాతం నుంచి 6.1 శాతం మధ్య ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:

కేవలం రూ.500తోనే దీనిలో చేరచ్చు. గరిష్టంగా ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. బ్యాంకులలో కంటే ఎక్కువే వస్తోంది.

సుకన్య సమృద్ధి యోజన:

పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి కూడా ఒకటి. పదేళ్ల లోపు పిల్లల కోసం దీన్ని ఓపెన్ చెయ్యచ్చు. కేంద్ర ప్రభుత్వం 7.6 శాతం వడ్డీ ని సుకన్య సమృద్ధి యోజన కింద ఇస్తోంది. రూ.250తోనే ఈ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ తో కూడా బ్యాంకులలో కంటే ఎక్కువే వస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news