Breaking : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐఏఎస్‌లకు సైతం ఫేస్ రికగ్నేషన్ యాప్

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటరీయేట్లో విధులు నిర్వహించే ఐఏఎస్సులకూ సైతం ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరీయేట్‌లోని ఉన్నతాధికారులూ ఫోన్లల్లో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ నెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఫోన్ నుంచి అటెండెన్స్ వేస్తున్నారు సెక్రటేరీయేట్లో పని చేస్తోన్న ఐఏఎస్సులు. సెక్రటేరీయేట్ నుంచే విధులు నిర్వహించాలని స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ హోదాల్లోని అధికారులకు గతంలోనే సీఎం, సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం, సీఎస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సెక్రటేరీయేట్ నుంచి కాకుండా హెచ్‌వోడీల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు పలువురు ఐఏఎస్సులు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy meets PM Narendra Modi, discuss  various issues- The New Indian Express

అయితే.. ఐఏఎస్సులను గాడిలో పెట్టేందుకు టీచర్ల తరహాలోనే ఐఏఎస్సులకూ ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేస్తున్నట్లు సర్కార్‌ వెల్లడించింది. సీఎంఓలో విధులు నిర్వహించే వాళ్లు.. సీఎం కార్యాలయం నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని స్పష్టం చేసింది సర్కార్‌. ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయకుంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది ప్రభుత్వం. గెజిటెడ్ అధికారులకు ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news