మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పలు పోస్టులను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఇంజనీరిం గ్‌లో భాగంగా సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులు వున్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇక అర్హత వివరాల లోకి వెళితే.. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ తో పాటు ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రయారిటీని ఇస్తారు. సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్‌లో భాగంగా కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ అండ్ మేనేజ్‌మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే వారు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. నెట్/ స్లెట్/ సెట్ అర్హత ఉండాలి.
అలానే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే… రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు 21-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.