వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తన ఇంటిపై దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై పెంపుడు కుక్కులను వదిలారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
శాంతి సందేశం పంపిస్తున్న చైనా !
హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా డిజిటల్ స్ట్రైక్స్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన @narendramodi గారికి దేశమంతా జేజేలు 👍👍— PVP (@PrasadVPotluri) July 7, 2020
పోలీసులు ఆయనకోశం గాలిస్తున్న సమయంలో ప్రధాని మోదీని ప్రశంసిస్తూ పీవీపీ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. “శాంతి సందేశం పంపిస్తున్న చైనా ! హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా డిజిటల్ స్ట్రైక్స్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన నరేంద్ర మోదీ గారికి దేశమంతా జేజేలు” అని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పీవీపీ.