పవర్‌ ప్యాక్‌డ్‌ ‘పక్కా కమర్షియల్‌’ ట్రైలర్‌

-

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా పాటలను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అది అలా ఉంటే పక్కా కమర్షియల్ సినిమాకు టిక్కెట్ల రేట్లు తగ్గించబోతున్నట్టు తెలిపారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా ‘పక్కా కమర్షియల్‌’ టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని పేర్కోన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా రేట్స్ ఎలా ఉంటాయో కూడా ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం.. నైజాం (తెలంగాణ) మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాకి రూ.160 (జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150 (జీఎస్టీ అదనం), సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీ అదనం)గా టికెట్‌ రేట్లు ఉంటాయి.ఇక తాజాగా ఇదే విధంగా అడివి శేష్ మేజర్, కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలకు టికెట్స్ తగ్గింపు బాగానే కలిసొచ్చింది.

Gopichand Grateful To Producer M. Nageswara Rao For Helping Him in His  Initial Years

ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి పవర్ ప్యాక్‌డ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో తండ్రి, కొడుకులకు విడాకులు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అంతేకాదు ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నిండివుంది. దీంతో పాటు రాశీ ఖన్నా రోల్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తంగా ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో.. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాటను వదిలింది టీమ్. అందాల రాశి అంటూ సాగే ఈ పాట బాగుంది. నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. కృష్ణ కాంత్ రాశారు. శ్రీ చరణ్, రమ్య బెహరా పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news