ఈ కాలంలో మహిళా సాధికారికతకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. హిందూ పురాణాల్లో దీనిని గుర్తించిందనడానికి పురాణాల్లో చెప్పిన పాత్రలే నిదర్శనం. పురాణాలు, ఇతిహాసాల్లో మహిళలకు బలమైన పాత్రలు నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మహాభారతంలో ద్రౌపది, కుంతి, సుభద్ర, గంగ, రామాయణంలో సీత, మండోదరి, మేనక పాత్రలు ఎంతో ఆదర్శం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. మగువ ఔన్నత్యాన్ని గురించి కొన్ని వేల సంవత్సరాల కిందటే మన భారతీయ సమాజం గుర్తించింది.
- విష్ణువు స్త్రీరూపం మోహిని. ఈ అవతారం పెద్ద వరం. క్షీరసాగర మథనంలో లభించిన అమృత కలశాన్ని రాక్షసులు తెలివిగా దక్కించుకుంటారు. మోహిని అస్త్రంగా చేసుకున్న దేవతలు అమృతాన్ని దక్కించుకుంటారు. ఈ అవతారం నేటి తరం మహిళలకు ఆదర్శం.
- అగ్ని నుంచి జన్మించిన ద్రౌపది అగ్ని జ్వాల వలే అందమైన, బలమైన స్త్రీ. మహాభారత యుద్ధానికి పరోక్ష కారణం. తనను అవమానించిన దుశ్శాసనుడి రక్తం కళ్ల చూసే వరకు కురులు ముడవలేదు.13 సంవత్సరాల వరకు దుశ్శాసనుడి అంతం కోసం ఎదురు చూసింది.
- ఘటోత్కచుడి తల్లి హిడింబి ఎవరి సాయసహకారాలు లేకుండానే ఘటోత్కచుడికి ఉన్నత విలువలను నేర్పింది. పాండవులు అరణ్యవాసం చేసినపుడు అప్పుడు తమపై దాడి చేసిన హిడింబాసురుని భీముడు సంహరిస్తాడు. తన సోదరి అయిన హిడింబిని పెళ్లి చేసుకున్న కొన్నిరోజులకు అక్కడి నుంచి హస్తినకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఘటోత్కచుడు పుడతాడు. అప్పటి నుంచి ఒంటరిగానే హిడింబి ఘటోత్కచుడిని పెంచుతుంది.
- భర్త శాపవిమోచనం కోసం తన పుత్రులను త్యాగం చేస్తుంది గంగ. మన పురాణాల్లో కల్మషం లేని పవిత్రతకు నిదర్శనం.
- మండోదరి రావణుడి భార్య. ఆధ్యాత్మిక చింతన కలది. సీత విషయంలో రావణుడిని వ్యతిరేకించింది. భర్తకు హెచ్చరికలు కూడా చేసింది.
- వాలి భార్య తార. ఉన్నత విలువలున్న మహిళ.
- జనకుడి కూతురు సీత. శ్రీరాముని ధర్మపత్ని. క్షమాగుణం కలిగింది. ఒంటరి తల్లిగా లవకు లకు జన్మనిచ్చి వారిని గొప్పవీరులుగా తయారు చేసింది.