ప్రభాస్, మారుతి హిట్ ఫార్ములా వర్క్ ఔట్ అయ్యేనా.!

-

ప్రభాస్ హీరోగా నటించిన  బాహుబలి 1,2 సినిమాలతో తన పాపులారిటీ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.దాని తర్వాత విడుదల అయిన సాహో బాలీవుడ్ లో ఆడినా తెలుగులో అంతగా వసూళ్లు రాబట్టలేక పొయింది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ దారుణంగా ప్లాప్ అయ్యింది.

ప్రస్తుతం రామాయణం ఆధారంగా తీస్తున్న ఆది పురుష్  జనవరిలో విడుదల కు సిద్ధంగా వుంది. తర్వాత సలార్, ప్రాజెక్ట్ K సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు.అయితే వీటి అన్నింటి మధ్యలో ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో ఒక చిన్న సినిమా చేస్తున్నాడు. ఇది దయ్యం కాన్సెప్ట్ తో ఒక సినిమా థియేటర్ చూట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. అలాగే దీనిలో ప్రేమ కథా చిత్రం లాగా ఆకట్టుకొనే అన్ని అంశాలు వుండేలా మారుతి చూసుకుంటున్నాడట.

అలాగే దీనిలో తాత మనవడు సెంటిమెంట్ సూపర్ గా ఉంటుందట. అలాగే సినిమా పేరు కూడా సినిమా థియేటర్ పేరు, ప్రభాస్ పేరు వచ్చేలా రాజా డీలక్స్ గా పేరు పెట్టారని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్ ను ఇబ్బంది పెట్టకుండా మారుతి చాలా కేర్ తీసుకొని షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులు కు స్పెషల్ ట్రీట్ గారెంటీ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news