సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తి స్వార్ధం, ఒక పార్టి కుట్రతో ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ప్రజల తీర్పు న్యాయం వైపేనని స్పష్టంగా తెలుస్తుందని, మూడు నెలలుగా కష్టపడి గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలకు, సహకరించిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునెందుకు ఉప ఎన్నిక. రేపటి విజయం తెలంగాణ అభివృద్ధికి, దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు పునాది.
కేంద్ర ప్రభుత్వం చేయలేని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆణచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ ఎన్నీ కుట్రలు కుతంత్రాలు చేసినా, ఐటీ, ఈడీ, అన్ని రాజ్యాంగ సంస్థలను ఉపయోగించినా. మునుగొడు ప్రజల స్ఫూర్తిని ఆపలేకపోయింది. మునుగోడులో బీజేపీ కి చెంపపెట్టు ఫలితం రాబోతుంది.
బీజేపీ ఎం మాట్లాడినా ప్రజలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలేదు. ఫార్మ్ హౌస్ వ్యవహారం లో దొరికిన దొంగల బండారం ప్రజల ముందు ఉంచాం. దొరికిన దొంగలను తప్పించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దొరికిన వారు నకిలీ ముఠా అయితే ఒరిజినల్ దొంగలు ఎవరో బండి చెప్పాలి. వేషాలు వేసి తాము తీసుకొస్తే అసలు దొంగలను మీరు బయటపెట్టాలి. తప్పించుకునే ప్రయత్నంలో డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్న బీజేపీ. దొరికిన వారు ఒరిజినల్ కానప్పుడు నందకుమార్ భార్య కేసు ఎందుకు వేసిందో చెప్పాలి అని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.