వైరల్‌ అవుతున్న సలార్‌ లొకేషన్‌లో ప్రభాస్‌ మాస్‌ ఫోటోలు

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు డార్లింగ్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు ప్రభాస్‌ నిర్మాతలు. ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్‌. కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి వర్కింగ్‌ స్టిల్స్‌ విడుదల చేయగా..నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ కంటెయినర్‌పై మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌కు విజువల్‌ ట్రీట్ ఇస్తున్నాడు.

Salaar | సలార్‌ లొకేషన్‌లో ప్రభాస్‌ మాస్‌ లుక్స్‌.. ట్రెండింగ్‌లో బర్త్‌ డే  స్పెషల్‌ స్టిల్స్‌

ప్రభాస్‌ మాసీ లుక్ సలార్‌ సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో కోలీవుడ్‌ భామ శృతిహాసన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ప్రభాస్‌ మరోవైపు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్‌ కే లుక్‌ ఒకటి కూడా విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్‌ మరోవైపు తానాజీ ఫేం ఓం రౌత్‌ దర్శకత్వంలో మైథాలాజికల్‌ ప్రాజెక్ట్‌ ఆదిపురుష్‌ కూడా చేస్తున్నాడు‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news