600కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ చిత్రం..

-

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్, ఆ తర్వాత చేస్తున్న చిత్రాలన్నింటినీ భారీ బడ్జెట్ లోనే తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో చేస్తున్న సైంటిఫిక్ చిత్రం మరోటి. ఈ మూడు చిత్రాలలో రాధేశ్యామ్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టకపోయినప్పటికీ మిగతా వాటికి మాత్రం ఓ రేంజిలో నిర్మిస్తున్నారు.

- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి 500కోట్ల వరకు పెడుతున్నారట. అదే నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమాకి 600 కోట్ల వరకూ పెడుతున్నారట. ఈ మేరకు చిత్ర నిర్మాత అశ్వనీదత్ వెల్లడి చేసాడు. మొదటి నుండి ఈ సినిమాపాన్ వరల్డ్ అని చెబుతూనే ఉన్న సంగతి తెలిసిందే. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో సాగే ఈ కథ అత్యంత భారీగా తెరకెక్కుతోందట. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ పూర్తయ్యాకే నాగ్ అశ్విన్ తో సినిమా మొదలవుతుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...