Pragathi: ప్రైవేటు పార్టీలో రెచ్చిపోయిన ప్రగతి..ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా సెలబ్రేషన్స్

-

వెండితెరపైన సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బోలెడన్ని పాత్రలు పోషించింది ప్రగతి. ఈమె తెలుగు సినిమాల్లో అమ్మ, అత్త క్యారెక్టర్లకు పెట్టింది పేరు. కాగా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఈమె చాలా మోడ్రన్ గా ఉంటుంది. టాటూ కనబడేలా డ్రెస్సులతో పాటు ఊర మాసు డ్యాన్స్ స్టెప్పులు వేసి ఉర్రూతలూగిస్తుంటుంది.

సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసిన వీడియో లు , ఫొటోలు క్షణాల వ్యవధిలోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ మె ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు బాగా వైరలవుతున్నాయి. స్లీవ్ లెస్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ గ్లామరస్ లుక్స్ లో సదరు ఫొటోల్లో కనబడుతోంది. ఇంతకీ ఈ ప్రైవేటు పార్టీ ఏంటో తెలుసా..ప్రగతి బర్త్ డే.

‘బెస్ట్ బర్త్ డే ఎవర్’ అనే క్యాప్షన్ తో తన బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను ప్రగతి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలను చూసి నెటిజన్లు ‘ప్రగతి ఆంటీ ఉఫ్ సోహాట్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తూనే జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. హాటెస్ట్ ప్రగతి, బ్యూటిఫుల్ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోల్లో రకరకాల ఫోజుల్లో చాలా హ్యాపీగా కనబడుతోంది ప్రగతి.

https://www.instagram.com/p/Ccfqrsfvq4E/

Read more RELATED
Recommended to you

Latest news