ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్.. మార్నింగ్ షో కలెక్షన్స్ అంత లేదు నీ సినిమా బడ్జెట్

-

’మా‘ లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య రాజకీయాన్ని తలపించే సంగ్రామం జరుగుతోంది. ఇన్నాళ్లు కొంత సంయమనంతో ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ కూడా విమర్శలకు తెరలేపింది. తాజాగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుపై సంచలన కామెంట్స్ చేశారు. మాట్లాడేటప్పుడు స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని విష్ణుకు హితవు పలికారు. ’పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత లేదు నీ సినిమా బడ్జెట్‘ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరి గురించైనా మాట్లాడేటప్పడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని విష్ణును ప్రకాష్ రాజ్ హెచ్చిరించారు. మీకేదైనా పోలిటికల్ ఎజెండా, గవర్నమెంట్ ఉంటే ఉండనివ్వండి అది కాదు పవన్ కళ్యాణ్ కూడా తెలుగు ఇండస్త్రీలో భాగమే అని తెలుసుకోవాలని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ విమర్శలకు విష్ణు ప్యానెల్ ఎలా కౌంటర్ చేస్తుందో చూడాలి. రెండు ప్యానెళ్ల మధ్య రానున్న రోజుల్లో మరింతగా వాదప్రతివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news