ఇది గమనించారా…లక్ష్మీపార్వతి భలే లాజిక్ చెప్పారే…నిజమేనా?

ఏపీ రాజకీయాలు బాగా బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఓ వైపు ప్రతిపక్ష టి‌డి‌పి…జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి నిత్యం ఏదొక అంశంపై విమర్శలు చేస్తూనే ఉంటుంది. అలాగే పలు ప్రజా సమస్యలపై పోరాటం అంటూ హడావిడి చేస్తుంది. ఇక ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం దూకుడు పెంచారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. పవన్-వైసీపీ నేతల మధ్య నువ్వా-నేనా అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది.

Lakshmi-Parvati
Lakshmi-Parvati

అయితే పవన్ వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పవన్ చెప్పినట్లుగానే రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. సరే ఇంతవరకు కథ అంతా బాగానే ఉంది అనుకుంటే తాజాగా లక్ష్మీపార్వతి సరికొత్త లాజిక్‌తో ముందుకొచ్చారు. చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదని, పవన్ కల్యాణ్ అని చెప్పి షాక్ ఇచ్చారు. చంద్రబాబు వారసుడు ఎవరో త్వరలో తేలబోతుందని, టీడీపీ నేతలు రాసిచ్చే స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని లక్ష్మీపార్వతి సెలవిచ్చారు.

అలాగే తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌పై కూడా మాట్లాడుతూ… తెలంగాణకు చెందిన అకాడమీలో దుర్వినియోగం అయిన నిధులకు ఏపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. సరే ఈ నిధులు విషయం పక్కనబెడితే….అసలు చంద్రబాబుకు నిజమైన రాజకీయ వారసుడు పవన్ కల్యాణ్ అని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది.

అయితే రాజకీయంగా పరిస్తితులని చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. పవన్…ఒక్క మాట కూడా చంద్రబాబుని అనరు…ఏకధాటిగా జగన్‌నే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఇక్కడే ఇంకో లాజిక్ ఆలోచిస్తే….మొన్నటివరకు లోకేష్…ఎంత హడావిడి చేశారో అంతా చూశారు. ఆఖరికి అరెస్ట్ అయ్యేవరకు వెళ్లారు. అంత హడావిడి చేసిన లోకేష్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

లోకేష్ సైలెంట్ అవ్వడమే ఆలస్యం పవన్ ఎంట్రీ ఇచ్చారు….దూకుడుగా జగన్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడే ఏదో తేడా కొట్టేస్తుంది. అసలు ఇదంతా చంద్రబాబు నడిపిస్తున్న కథే అని సగటు రాజకీయం తెలిసినవారికి డౌట్ రాకమానదు. చూడాలి మరి చంద్రబాబు అసలు రాజకీయ వారసుడు ఎవరో?