“భీమ్లా నాయక్”పై ఎందుకు అంతా కక్ష..జగన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.. !

-

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.”భీమ్లా నాయక్” సినిమాపై సిఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు ఎందుకు అంతా కక్ష అంటూ నిప్పులు చెరిగారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ మేరకు తన ట్విటర్ లో పోస్ట్ పెట్టారు నటుడు ప్రకాష్ రాజ్.  సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి ? అని ఫైర్ అయ్యారు ప్రకాష్ రాజ్.

చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నాము అంటే నమ్మాలా ? అని ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలని పేర్కొన్నారు. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు అని నిలదీశారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా… తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరు అడ్డుకట్ట వేయలేరు అని ప్రకాష్ రాజ్ జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇకనైనా ఈ కక్ష సాధింపు చర్యలను… ఆపేయాలని డిమాండ్ చేశారు ప్రకాష్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news