కేసీఆర్ ది ఓ ఈ ప‌నికిమాలిన‌ సర్కార్..తరిమికొట్టాలి : విజయశాంతి

-

టీఆర్ఎస్ ది ఓ ఈ ప‌నికిమాలిన‌ సర్కార్..తరిమికొట్టాలని పిలుపునిచ్చారు విజయశాంతి. రుణమాఫీ స‌కాలంలో అమ‌లుకాక‌పోవడంతో తెలంగాణ‌ రైతన్న‌ల‌ పరిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది.. ఎన్నిక‌ల‌ప్పుడు ఇచ్చిన హామీలకు వేల కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నా.. నిధులు మాత్రం పైసా కూడా విడుద‌ల‌ చేయ్య‌డం లేదని ఫైర్ అయ్యారు. రైతురుణాల మాఫీలో ఈ చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌ సర్కార్… ఈ మూడేండ్లలో 17 వేల కోట్లు కేటాయిస్తే.. రూ.3వేల కోట్లు మాత్ర‌మే ఇచ్చి చేతులు దులుపుకొందని మండిపడ్డారు.

దీనిలో తొలిసారి రూ.400 కోట్లు, రెండోసారి రూ.300 కోట్లు తిరిగి ప్రభుత్వ సంచిలోకే చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా… రూ.25 వేలలోపు రైతులు 2.96 లక్షల మంది, రూ.50వేలలోపు రైతులు నాలుగున్నర లక్షల మందికి మాత్రమే మాఫీ చేసి ఈ దొంగ స‌ర్కార్ చోద్యం చూస్తుందని అగ్రహించారు. ప్రభుత్వం రుణ‌మాఫీ చెల్లిస్తుంది కదా అని రైతులు ఏండ్లుగా ఎదురుచూస్తూ ఉండటంతో వడ్డీకి వ‌డ్డీ పెరిగి రైతుల న‌డ్డి విరిగిపోతోందని… స‌రైన స‌మ‌యానికి ఈ న‌క్క‌జిత్తుల కేసీఆర్ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల దృష్టిలో మొండి బకాయిదారులుగా మారారన్నారు. దీంతో మళ్లీ రుణాలు తీసుకునేందుకు వారంతా ఛాన్స్ కోల్పోయి బోరుమంటున్నారు… రాష్ట్రంలో సుమారు 34 లక్షల మంది రైతులు తమ బ్యాంకు రుణం ఎప్పుడు మాఫీ అవుతుందా అని కండ్ల‌ల్లో వొత్తులు వేసుకుని ఎదురు చూస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు.

రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం నుంచి రాక‌పోవ‌డంతో… రైతులకు వచ్చిన రైతుబంధు పైసలు, ధాన్యం అమ్మిన సొమ్మును బ్యాంక‌ర్లు అప్పులు, వడ్డీ కిందికి జమ చేసుకుంటున్నారు.. మూడేండ్ల సంది రైతుల పంట రుణాలు పెండింగ్​లో ఉన్నాయి… దీంతో బ్యాంకు అధికారులు అప్పులు చెల్లించని, కనీసం లోన్లను రెన్యువల్ చేయని రైతుల అకౌంట్లను మొండి బకాయిలుదారుల జాబితాలో పెడుతున్నారని పేర్కొన్నారు.

ఈ ప‌నికిమాలిన‌ టీఆర్ఎస్ సర్కార్ మూడేండ్ల సంది రైతుల‌ను నానా అవ‌స్థ‌ల‌కు గురిచేస్తుంది. ఇచ్చిన మాట ప్ర‌కారం కూడా కేసీఆర్ రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరు కుపోతున్నారు… కేసీఆర్ అప్ర‌జాస్వామిక పాల‌న‌లో రైతన్న‌లు ఆగ్ర‌హాంతో ఊగిపోతున్నారు. అన్న‌దాత‌ల‌ను ప‌ట్టించుకోని ఈ స‌ర్కార్ కు త్వ‌ర‌లోనే బుద్ధి చెప్ప‌టం ఖాయ‌మ‌ని దుమ్మెత్తిపోస్తున్నారని అగ్రహించారు. ఈ నియంతృత్వ కేసీఆర్ స‌ర్కార్ కు రానున్న ఎన్నిక‌ల్లో ఓటుతో బుద్ధి చెప్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news