కొంత మంది నేతలకే వైఎస్ దేవుడు.. మాకు కాదు : మరోసారి స్వరం పెంచిన తెలంగాణ మంత్రి

-

నీటి వివాదంపై మరోసారి ఏపీపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు వైఎస్సార్ దేవుడు ఎట్లా అవుతారని..నిఖార్సయిన తెలంగాణ బిడ్డలకు వైఎస్సార్ దేవుడు కాదని పేర్కొన్నారు. బావదరిద్య్రం, మోచేతి నీళ్ళు తాగే కొంత మంది నేతలకు వైఎస్ దేవుడు కావచ్చని మండిపడ్డారు. ఎపి ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత 7వ రోజు కృష్ణ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ లేఖ రాసిందని.. పోతిరెడ్డిపాడు పనులకు కాంగ్రెస్ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య కొబ్బరికాయ కొడితే… డీకే అరుణ హారతి పట్టారని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రజల పక్షాన ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడితే …ఇక్కడి బిజెపి అధ్యక్షుడికి ఏమి అయ్యింది ? అని ప్రశ్నించారు.

ఎపి అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం నిష్క్రియపర్వం ఎందుకు ? కేంద్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. నాకు వైఎస్సార్ కు వ్యక్తిగతముగా ఏమి లేదు…నేను తెలంగాణ బిడ్డగా సమస్యపై మాట్లాడా అని పేర్కొన్నారు. కృష్ణ బోర్డు ఎపి ప్రభుత్వముకు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపాలని ఆదేశించిందని.. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత నాయకులు నాపై అడ్డగోలుగా మాట్లాడారని నిప్పులు చెరిగారు. కృష్ణ బోర్డు ఆదేశాలపై ఆంధ్ర ప్రాంత నాయకులు ఏం చెబుతారు ? అని నిలదీశారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కు ఎటువంటి అనుమతులు లేవు.. కుడి కాలువ పనులు,రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని సీఎం జగన్ ను డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news