పీకే గోల ఏంటి స్వామి.. కేసీఆర్‌కు సీన్ అర్ధమైందా?

-

ఒకప్పుడు అధినేతలే పార్టీలకు పెద్ద స్ట్రాటజీ మాస్టర్‌లు..వారి వ్యూహాలతోనే పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అందుకే కొందరు నేతలని అపర చాణక్యులు అని కూడా పిలిచేవారు. అయితే ఇదంతా ఓ 10 ఏళ్ల క్రితం.. ఇప్పుడు ఆ అధినేతలకే అపర చాణక్యులు అవసరం అవుతున్నారు. అది కూడా కేవలం ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త మాత్రమే. ఈ పోలిటికల్ వ్యూకర్త సలహాలతోనే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. అలా అని పీకే పెద్ద నాయకుడు కాదు..కేవలం పార్టీలకు వ్యూహాలు అందిస్తూ, ఆ పార్టీల గెలుపు కోసం కృషి చేస్తారు.

అయితే ఈ పీకే గురించి మన తెలుగు ప్రజలకు బాగా తెలిసింది..2019 ఎన్నికల సమయంలోనే. ఇక ఈయన ఏపీలో జగన్ పార్టీ కోసం వ్యూహాలు రచించిన విషయం తెలిసిందే. అలాగే 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కృషి చేశారు. తర్వాత తమిళనాడులో స్టాలిన్‌కు, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌లకు ఈయనే వ్యూకర్తగా పనిచేశారు.

ఇప్పుడు రాజకీయ వ్యూహలు పన్నడంలో ధిట్ట అయిన కేసీఆర్ కోసం పనిచేయనున్నారు. ప్రత్యర్ధులని చిత్తు చేయడంలో కేసీఆర్ చాలా ముందు ఉంటారు. అలాంటి కేసీఆర్‌కు సైతం పీకే అవసరం పడ్డారు. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో అధికార పీఠం దక్కించుకున్న కేసీఆర్.. మూడో సారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ ఈ సారి అంత తేలికగా మాత్రం కేసీఆర్ అధికారంలోకి రావడం వీలయ్యేలా లేదు. అందుకే కేసీఆర్ సైతం పీకేనే పట్టుకున్నారు.

ఆల్రెడీ తెలంగాణలో పీకే టీం కేసీఆర్ పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టిందని తెలుస్తోంది. అయితే పీకే స్ట్రాటజీలు ప్రజలకు మేలు చేసేలా ఉండవు.. ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉంటాయి. ఇప్పటికే తెలంగాణలో ఇలాంటి రచ్చ మొదలైపోయిందని తెలుస్తోంది. తాజాగా కేసీఆర్ బూతుల ప్రెస్ మీట్ కూడా ఇందులో భాగమే అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాలని కూడా పీకే కలుషితం చేసేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version