టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి విడదల రజనిపై నేడు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. రజనికి వసూళ్లపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గంపై ఏమాత్రం లేదని వెల్లడించారు ఆయన. టీడీపీ చేసిన పనుల్లో 10 శాతమైనా వైసీపీ చేసిందా? అని అడిగారు ప్రత్తిపాటి. నాలుగేళ్లలో రజని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పసుమర్రు వంతెన, ఓగేరు వాగు వద్ద ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
ఈ నేపధ్యం లో మాట్లాడుతూ… చిలకలూరిపేట సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయన్నారు. టీడీపీ హయాంలో రూ.16 కోట్లతో ఎస్టీపీ పనులు చేపట్టామన్నారు. పసుమర్రు వంతెన కోసం చంద్రబాబు రూ.7.6 కోట్లు మంజూరు చేశారని అన్నారు ఆయన. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ వంతెనను పూర్తి చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గుత్తేదారుకు రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, బటన్ సీఎంగా నిలిచిపోయారని హేళన చేశారు.