పీఆర్సీ అంశం… ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

-

ఏపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్సీ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల ఓ వైపు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని ఆందోళన చేస్తుంటే… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు సంయమనం పాటించాలని ప్రభుత్వ పెద్దలు, మంత్రలు కోరుతున్నారు. ఇప్పటికే పేర్ని నాని, బోత్స, కన్నబాబు వంటి మంత్రులు ఉద్యోగులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాలన్నీ ఈరోజు భేటీ నిర్వహించి ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చాయి. ఇదిలా ఉంటే వచ్చే నెల 7 లేదా 8 నుంచి సమ్మె నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. ఉద్యోగులకు నచ్చచెప్పడానికి ఓ ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. మంత్రులు, సీఎస్ తో కమిటీ ఏర్పాటైంది. మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన, సజ్జల, సీఎస్ తో కమిటీ ఏర్పాటైంది. వీరంతా ఉద్యోగులతో చర్చించి బుజ్జగించే ప్రయత్నం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news