వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..గెస్ట్ ఎవరంటే !

-

మెగాస్టార్​ చిరంజీవి చేస్తున్న లెటేస్ట్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌ అయిందట. జనవరి 8న ఈ ఈవెంట్‌ ను నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అంతేకాదు, ఈ ఈవెంట్‌ కు పవన్‌ కళ్యాణ్‌ స్పెషల్‌ గెస్ట్‌ గా వస్తున్నారని టాక్‌. కాగా జనవరి 13 వ తేదీన వాల్తేరు వీరయ్య రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news