ఉలవ పంటలో తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

ఉలవ పంటను మన దేశంలో ఎక్కువగా పండిస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా పండిస్తారు.ఖరీఫ్ లో లేదా ఏ పంట వేయడానికి అనువుగా లేనప్పుడు, తొలి దశలో వున్న పండ్ల తోటలలో ఉలవ పంటను సాగుచేయవచ్చు..ఈ పంటను గద్వాల మరియు రంగారెడ్డి జిల్లాల్లో సాగుచేస్తారు.

నేలలు: నీరు పట్టి ఉంచే చల్కా, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండి. ఎక్కువగా చౌడు కల్గిన నేలలు పనికిరావు..అక్కడ వేసిన విత్తనాలు మొలకలు రావు..

విత్తు సమయం: సాధారణంగా రబీకి/ లేట్ ఖరీఫ్ ముందు మరియు రబీలో పండించవచ్చు. ఆగష్టు రెండవ వారం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు వేసుకోవచ్చును. నేల తేమను/ నీరును నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాలలో మొదటి పంటను దృష్టిలో వుంచుకొని సకాలంలో విత్తిన మంచి పంటను పండించవచ్చును.

విత్తన మోతాదు: సాళ్ళ పద్ధతిలో, గొర్రుతో ఎద పెట్టినప్పుడు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం వాడితే సరిపోతూంది.
విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 1 గ్రా, కార్బండాజిమ్లేదా ధైరమ్ విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి..

ఎరువులు:

సేంద్రియ ఎరువులు: ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు చివరి దుక్కిలో వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ భూమిలో కలియ దున్నాలి..

జీవన ఎరువులు: విత్తనానికి రైజోబియం కల్చర్ను పట్టించి. ఉపయోగించవలెను. 100 మి.లీ, నీటిలో 10 గ్రా.ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రా, రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను..

రసాయనిక ఎరువులు: ఎకరాకు 4 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్ మరియు 10 కిలోల భాస్వరం నిచ్చు ఎరువులు వేయాలి. 10 కిలోల యూరియా, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి..ఇలా ఈ విధంగా ఉలవ పంటలో జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. ఇంకేదైనా సందెహాలు ఉంటే వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news