దీపాలు వెలిగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

-

దీపాలు వెలిగించి కరోనా వైరస్ చీకట్లను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో దేశం మొత్తం ఇప్పుడు సిద్దమవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు అందరూ దీపాలు వెలిగించడానికి సిద్దమయ్యారు. ప్రధాని చప్పట్లు కొట్టాలి అని పిలుపు ఇవ్వగానే రెడీ అయిన జనం ఇప్పుడు కొవ్వొత్తుల కోసం సిద్దమయ్యారు. నేడు సాయంత్రం 9 గంటల 9 నిమిషాల వరకు దీపాలు వెలిగించడానికి మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ దీపాలు వెలిగించే కార్యక్రమానికి ప్రజలు అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పుడు కరోనా రాకుండా జనాలు అందరూ హ్యాండ్ శానిటైజర్ ని రాసుకుంటున్నారు. వాస్తవానికి దానికి మండే గుణం ఉంటుంది. దీపాలు వెలిగించే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే చేతులు కాలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

చేతులు సబ్బుతో కడుక్కోవాలని ఆ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు. ఇక మహిళలు దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దీపావళి కార్యక్రమంలా చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది అని పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఏ మాత్రం అలసత్వం వద్దని అసలే వాతావరణం వేడిగా ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news